లక్నో: కొన్ని రోజుల్లో మరిది పెళ్లి చేయనున్నారు. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. వదిన మాత్రం మరిదిని బెడ్ రూమ్‌కు పిలిచి అతడి ప్రైవేటు పార్ట్‌ను కట్ చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యుపిలోని ఆగ్రాకు చెందిన యోగేష్ అనే యువకుడు ఉత్తరాఖండ్‌లోని ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. యోగేష్ పెళ్లి నిశ్చయం కావడంతో ఇంటి దగ్గర ఉంటున్నాడు. పెళ్లి పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మరిదిని వదిన బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లింది. అనంతరం అతడు ప్రైవేటు అంగాన్ని కట్ చేసింది. దీంతో అతడిని ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు సర్జరీ చేసి అతడి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వెల్లడించారు. తన చెల్లిని మరిది పెళ్లి చేసుకోకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడనే కోపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.