హైదరాబాద్: తెలంగాణ డిజిపి బి శివధర్ రెడ్డి ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోనున్నారు. ప్రస్తుతం 37 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్టు సమాచారం. లొంగిపోతున్న వారిలో కొయ్యడ సాంబయ్య, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు డిజిపి శివధర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎదురు కాల్పులు మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు హిడ్మా ఆయన సతీమణి రాజే సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు ఎపిలో కాకుండా తెలంగాణలో లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత సంవత్సర కాలంలో 320 మంది మావోయిస్టులు హతమయ్యారు.