పెర్త్: ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ లో భాగంగా శుక్రవారం ఇంగ్లండ్, ఆ స్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం ప్రా రంభమైన తొలి టెస్టులో మొదటి రోజు బౌలర్ల హవా నడిచింది. తొలుత బ్యా టింగ్ చేసిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 32.5 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నిం గ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్ల లో 123 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఇం గ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న ఆనందం ఆస్ట్రేలియాకు ఎక్కువ సేపు నిలువలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఆస్ట్రేలియా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది.
ఓపెనర్ జాక్ వెదరాల్డ్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మార్నస్ లబుషేన్ (9) కూడా నిరాశ పరిచాడు. ఉస్మాన్ ఖ్వాజా (2), కెప్టెన్ స్మిత్ (17), ట్రావిస్ హెడ్ (21), కామెరూన్ గ్రీన్ (24), అలెక్స్ కారే (26), స్టార్క్ (12) పరుగులు చేసి పెవిలియ న్ చేరారు. స్కాట్ బొలాండ్ సున్నాకే వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ 23 పరుగులకే ఐదు వికెట్లు తీశాడు. ఆర్చర్, కార్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ 172 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ అసాధారణ బౌలింగ్‌తో ఇంగ్లీష్ బ్యాటర్లను హడలెత్తించాడు. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన స్టార్క్ 58 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓలి పోప్ (46), హ్యారీ బ్రూక్ (52), జేమీ స్మిత్ (33), డకెట్ (21) మాత్రమే రాణించారు.