మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వం 32 మంది ఐపిఎస్‌లకు స్థాన చలనం కలిగించింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పలువురు అధికారులకు తాజాగా పోస్టింగులు లభించగా.. మరికొంత మంది బ దిలీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా మకృష్ణారావు ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేశారు. దేవేంద్ర సింగ్ చౌహాన్ అదనపు డిజిపి మల్టిజోన్-2 నుంచి డిజిపిఆఫీస్ (పర్సనల్)కు, పరిమల హనా నూతన్ జాకబ్ హై దరాబాద్ సిటి జాయింట్ కమిషనర్ నుండి సి ఐడి డిప్యూటి ఐజిగా, చేతన మైలబత్తుల ఉమె న్ సేఫ్టీ వింగ్ ఎస్పీ నుండి ఆర్‌బివిఆర్‌ఆర్ పో లీస్ అకాడమి డిప్యూటిగా, నారాయణరెడ్డి వి కారాబాద్ ఎస్పీ నుండి మహేశ్వరం జోన్‌కు డిసిపిగా, మల్కాజ్‌గిరి డిసిపి పద్మజ ఎస్పీ (అడ్మిన్), యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకు, పాటి ల్ సంగ్రామ్‌సింగ్ గణపత్రావ్ సిఐడి ఎస్పి నుం డి నాగర్‌కర్నూల్ ఎస్పిగా, జయశంకర్ భూపాలపల్లి ఎస్పిగా విధులు నిర్వహిస్తున్న ఖరే కిర ణ ప్రభాకర్ హైదరాబాద్ డిసిపి సౌత్ జోన్‌కు, చెన్నూరి రూపేశ్ యాంటీ నార్కోటిక్ ఎస్పి నుండి హైదరాబాద్ ఎస్‌ఎం, ఐటి డిసిపిగా, ములుగు ఎస్పిగా ఉన్న శబరీశ్ మహబూబాబాద్ ఎస్పీగా, నితికా పంత్ కమాండెంట్ రెండో బెటాలియన్ నుండి కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పిగా,
గిరిధర్ వనపర్తి ఎస్పి నుండి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పిగా,స్నేహా మెహ్రా సౌత్ జోన్ డిసిపి నుండి వికారాబాద్ ఎస్పిగా, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డిసిపిగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పిగా కేకన్ సుధీర్ రామనాథ్, గవర్న్ ఏసిడిగా ఉన్న సిరిసెట్టి సంకీర్త్ జయశంకర్ భూపాలపల్లి ఎస్పిగా, గవర్నర్ ఏడిసిగా పాటిల్ కాంతిలాల్ సుభాశ్, బి.రామ్ రెడ్డి ఎస్పి సిఐడి నుంచి పెద్దపల్లి డిసిపిగా, సి.శ్రీధర్ ఇంటెలిజెన్స్ ఎస్పి నుంచి మల్కాజిగిరి డిసిపిగా, ఎస్‌డిపివోలుగా ఉన్న అవినాశ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెంకు అడిషనల్ ఎస్పిగా, కాజల్ ఆదిలాబాద్‌కు అడిషనల్ ఎస్పిగా, కంకనాల రాహుల్ రెడ్డి భువనగిరి అడిషనల్ ఎస్పిగా, శేషాద్రిని సురుకొంటి రాజన్నసిరిసిల్లా అడిషనల్ ఎస్పిగా, శివం ఉపాధ్యాయ ములుగు అడిషనల్ ఎస్పి (ఆపరేషన్స్)గా, భైంసా ఎస్‌డిపిఓగా రాజేశ్ మీనా, మౌనికా ఏఎస్పి నుంచి ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పి అడ్మిషన్‌గా, గ్రేహౌండ్స్ ఏఎస్పిలుగా ఉన్న మనన్ భట్ ఏటూరు నాగారం ఏఎస్పిగా, పతిపాక సాయి కిరణ్ నిర్మల్ ఏఎస్పిగా, రుత్విక సాయి కొట్టే వేములవాడ ఏఎస్పిగా, యాదవ వసుందర ఫౌరెబి ఏఎస్పి నుంచి సతుపల్లి, ఖమ్మంకు ఏఎస్పిగా, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఎస్.శ్రీనివాస్ ట్రాన్స్‌కో ఎస్పిటిజిగా, డి.సునీత వనపర్తి ఎస్పిగా, కె.గుణశేఖర్ రాచకొండ డిసిపి క్రైమ్స్‌కు బదిలీ అయ్యారు.