అప్పుల బాధతో కూరగాయలు వ్యాపారం చేసే భార్యా భర్తలు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తపేట మార్గదర్శి కాలనీ రోడ్డు నెంబర్ 4లో గడ్డమిది మల్లేష్ (45), సంతోషి (37) భార్యాభర్తలు నివాసం ఉంటూ కూరగాయలు వ్యాపారం చేస్తుంటారు. ఇద్దరు తెల్లవారు జామున 5.30 గంటలకే ప్రతి రోజు వాకింగ్ వెళుతుంటారు. శుక్రవారం ఉదయం వారి కూతుళ్లు మేఘన, మౌనికలు నిద్రపోతుండగా 5ః30 నిమిషాలకే వాకింగ్ బయల్దేరారు. రోజు వచ్చే వారు ఇంత వరకు రాలేదని కూమారుడు 7.45 నిమిషాలకు తండ్రి మల్లేష్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.
కూమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసి స్పందన లేకపోవడంతో కూమారుడు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతుకుతున్న క్రమంలో నాగోల్ ఠాణా పరిధిలో తట్టిన్నారం ప్రాంతంలో ఓ జంట విషం సేవించారని తెలిసింది. విషం సేవించిన సంతోషి అక్కడిక్కడే మృతి చెందంగా , పోలీసులు విషమంగా ఉన్న మల్లేష్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మల్లేష్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు