హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపిఎల్‌లు బదిలీ అయ్యారు. ఇందులో సిఐడి కొత్త డిజిగా పరిమళన్ నూతన్ నియమితులయ్యారు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్, మహేశ్వరం డిసిపిగా నారాయణరెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎస్పిగా వైభవ్ గైక్వాడ్, సౌత్ జోన్ డిసిపిగా కిరణ్ కారే, మల్కాజ్‌గిరి డిసిపిగా శ్రీధర్, మహబూబాబబాద్ ఎస్పిగా శభరీష్, వనపర్తి ఎస్పీగా సునీత, వికాకరాబాద్ ఎస్పిగా స్నేహమిశ్రా, కొమరం భీం జిల్లా ఎస్పిగా నిఖితా పంత్, ములుగు ఎస్పిగా సుధీర్, భూపాలపల్లి ఎస్పిగా సంకేత్, తెలంగాణ నార్కోటిక్ ఎస్పిగా పద్మజ, నాగర్ కర్నూల్ ఎస్పిగా సంగ్రామ్ సింగ్ నియమితులయ్యారు.
బదిలీ అయిన మగితా ఐపిఎస్‌లు :
దేవేంద్ర సింగ్ చౌహాన్-మల్టీజోన్ డీసీపీగా బదిలీ
పద్మజా -సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోగా బదిలీ
చిన్నూరి రూపేశ్-హైదరాబాద్ డీసీపీగా బదిలీ
గిరిధర్-యాంటి-నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా బదిలీ
సంకీర్త్ -జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా బదిలీ
సుభాష్-గవర్నర్ ఏడీసీగా బదిలీ
రామ్ రెడ్డి -పెద్దపల్లి డీసీపీగా బదిలీ
అవినాష్ కుమార్-అడిషనల్ సూపరిండెంట్ ఆప్ పోలీస్ ( ఆపరేషన్స్)గా బదిలీ
కాజల్-ఉట్నూర్ అడిషనల్ ఎస్పీగా బదిలీ
రాజేష్ మీనా -ఎస్డీపీఏ బైంసాగా బదిలీ
మౌనిక -అడిషనల్ ఎస్పీ ఆదిలాబాద్ బదిలీ
మనన్ భట్ -ఏటురు నాగారం ఏఎస్పీగా బదిలీ
సాయ్ కిరణ్- ఏఎస్పీ నిర్మల్‌గా బదిలీ
రుత్విక్ -ఏఎస్పీ వేములవాడ
యాదవ్ వసుంధర-ఏసీపీ సత్తుపల్లిగా బదిలీ
శ్రీనివాస్-టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా బదిలీ
సునీత-వనపర్తి ఎస్పీగా బదిలీ
గుణశేఖర్-డీసీపీ రాచకొండ బదిలీ