హైదరాబాద్: కాంగ్రెస్ కు పెట్టుబడులు రాకుండా పారిశ్రామిక వేత్తలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిగులు రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కెటిఆర్ ఎక్కెక్కి ఏడుస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో ఏం జరగకూడదని కెటిఆర్ కోరుకుంటున్నారని చామల విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు రిఫరెండం అని కెటిఆర్ అన్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కెటిఆర్ భూటకపు మాటలను ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పదేళ్లు అధికారమిస్తే ఏం చేశారు? అని ఎంపి చామల ప్రశ్నించారు.