రంగారెడ్డి: అప్పలు వాళ్లు వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాహెబ్‌నగర్‌లో పారంద శ్రీకాంత్(32) అనే యువకుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. నలుగురు అతడు రెండు లక్షల రూపాయల వరకు అప్పులు చేసేవాడు. శ్రీకాంత్ ఈ నెల 23న పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలో పెళ్లికి ముందు ఒత్తిడి చేస్తేనే డబ్బులు వస్తాయని అప్పులిచ్చిన అతడిని వేధించడం మొదలు పెట్టారు. అప్పుల వాళ్ల వేధింపులు తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లేటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఐతగోని శేఖర్, సుబ్బారావు, అప్పం శేఖర్, సత్యనారాయణ అని సూసైడ్ లేటర్‌లో తెలిపాడు. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేశాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు వెతకగా హరిహరపురం చెరువు కట్టపై అతడి మృతదేహం కనిపించింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.