మెయినాబాద్: రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలో జరిగింది. కనకమామిడి వద్ద బీజాపూర్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.