చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకుంది… పక్కింటి కుర్రాడితో రీల్స్ చేస్తున్నావని ప్రశ్నించినందుకు భర్యను భార్య చంపి ఉరేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం సేతపట్టు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇడయాన్‌కొళత్తూరు గ్రామంలో విజయ్(27), షర్మిళ అనే యువతి ప్రేమించి ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు(4), కుమారుడు(3) ఉన్నాడు. విజయ్ డ్రైవర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పది, పదిహేను రోజులకొకసారి ఇంటికి వచ్చేవాడు. ఇంటి పక్కన ఉండే యువకుడితో షర్మిలకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి రీల్స్ చేశారు. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. మళ్లీ షర్మిళ తన ప్రియుడితో రీల్స్ చేయడంతో భర్త ప్రశ్నించాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భర్త తలపై కర్రతో భార్య బాదింది. షర్మిళ తన తల్లి ఫాతిమా సాయంతో విజయ్ మృతదేహాన్ని కిటీకికి వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తలపై బలమైన గాయాలతో చనిపోయినట్టు శవ పరీక్షలో తేలడంతో భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.