ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది, ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను మహాలక్ష్మి క్యారెక్టర్‌లో కనిపిస్తాను. తను కాలేజ్ అమ్మాయిగా సాగర్‌తో ప్రేమలో ఉంటుంది. ఇందులో ఉపేంద్రతో -ఒక కాంబినేషన్ సీన్ ఉంది. ఆయనతో వర్క్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. -ఇందులో ప్రేమ కథ చాలా స్వచ్ఛంగా ఉండబోతుంది. నువ్వుంటే చాలు, చిన్ని గుండెలో పాటలు మీరు చూసే ఉంటారు. ప్రేమలో ఉన్న గొప్ప ఎమోషన్ వీటిలో ఉంటాయి. రామ్‌తో నటించడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను. లవ్ స్టొరీ, డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇది 2000లో జరిగే కథ. డైరెక్టర్ కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ అన్నింటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవి, నవీన్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది”అని అన్నారు.