మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్‌కు నాబార్డ్ సహకరించాలని డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభు త్వం ధృఢ సంకల్పంతో ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. గురువారం మాదాపూర్‌లోని హై టెక్స్‌లో ఏర్పాటు చేసిన నాబార్డ్ మొదటి ఎర్త్ స మ్మిట్‌లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలోనే అతిపెద్ద రుణమాఫీల్లో ఒకదాన్ని అమ లు చేసి దాదాపు 22 లక్షల కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల ఉపశమనం అందించామన్నారు. కొనుగోలు వ్యవస్థను విస్తరించి పారదర్శకంగా మార్చామని, రైతులకు నేరుగా, సమయానుసారం మద్దతు అందుకునేలా రైతు భరోసా అ మలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. సాగునీరు, డిజిటల్ పంట రికార్డులు, కోత తర్వా త మౌలిక వసతులలో పెట్టుబడులతో గ్రామీణ కు టుంబాల్లో బలమైన నమ్మకాన్ని పునరుద్ధరించామని తెలిపారు. సంక్షోభ సమయాల్లోనే కాదు, రై తుల ప్రతి రోజూ అభివృద్ధి పయనంలో ప్రజా ప్ర భుత్వం తోడుగా ఉంటుందని, ఇది తమ నిబద్ధత అన్నారు.
నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రథమ ఎర్త్ సమ్మిట్‌లో పాల్గొనడం తనకు లభించిన గొప్ప గౌరవం అన్నారు. వ్యవసాయం గురిం చి మనం మాట్లాడినప్పుడు సంస్థాగత విప్లవం లేకుండా ఏ గ్రీన్ రేవల్యూషన్ కూడా సాధ్యం కా దని గుర్తు చేసుకోవాలని, ఈ సత్యాన్ని అర్థం చే సుకున్న నాయకులు మన దేశానికి లభించటం ఒ క వరం అని వివరించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మిగతా అన్నీ ఆగవచ్చని, వ్యవసాయం ఆగకూడదనే నమ్మకంతో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సాగునీటి సంఘాలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు వంటి వ్యవస్థాగత నిర్మాణాన్ని సృ ష్టించారని తెలిపారు. ఇందిరా గాంధీ ముఖ్యంగా గ్రీన్ రేవల్యూషన్ కాలంలో ఆమె చూపిన ధైర్యం రైతుకు భారత ప్రభుత్వ సంపూర్ణ అండ లభించేలా చేసిందన్నారు.పిఏసీల ఆధునికీకరణ, సహకార సంస్థల బలోపేతం, వ్యవసాయ డిజిటలైజేషన్, ఎఫ్‌పిఓలకు సుస్థిర శక్తి ఇవ్వడం, గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి నాబార్డ్ అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. సమ గ్ర గ్రామీణ దృష్టికోణం విషయానికి వస్తే తెలంగాణలో మనం నిర్మిస్తున్న ప్రతిదీ డిజిటల్ మౌలిక వసతులు, అగ్రిటెక్, ఫిన్‌టెక్, పునరుత్పాదక శక్తి, ఇంక్యుబేషన్ ఇవన్నీ ఒకే దృష్టి వైపు సాగుతున్నాయన్నారు.నాబార్డ్ గ్రామీణ భారతానికి ఎప్పుడూ భాగస్వామి, మార్గదర్శి అని తెలిపారు.