మంత్రి ఇంట్లోకి చిరుత చొరబడిన సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో గురువారం చోటుచేసుకుంది. రాజస్థాన్ లోనే అత్యంత భద్రత కలిగిన సివిల్ లైన్స్ లో చిరుతపులి చొరబడడం కలకలం రేపింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సురేశ్ సింగ్ రావత్ ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. అనంతరం సమీపంలోని పాఠశాలలోకి వెళ్లింది. భద్రతా బలగాలు, అటవి సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించి చిరుతపులిని బంధించారు. ఈ నేపథ్యంలో చిరుత ప్రవేశించడం స్థానికంగా భయాందోళనకు గురిచేసింది