అమరావతి: ఏలూరు జిల్లా సూపర్ ఆక్వా ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ల్యాబ్ లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.