హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాజకీయకక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కెటిఆర్ ను ఎసిబి విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంపై హరీశ్ రావు స్పందించారు. ప్రతిపక్ష నేతలను వేధించడమే సిఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కెటిఆర్ అక్రమ కేసులు పెట్టారని, స్థానిక ఎన్నికల్లో రాజకీయలబ్ది కోసం చిల్లర డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కెటిఆర్ కు బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని హరీశ్ రావు పేర్కొన్నారు.