హైదరాబాద్: భారత దౌత్య అధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని అన్నారు. అడిక్ మెట్, రాంనగర్, విద్యానగర్ ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటించారు. సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు కెటిఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకే కుటుంబంలో 18 మంది మరణించటం అత్యంత విషాదకరమని, ఇప్పటికే కొందరు బిఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాలకు తోడుగా జెడ్డా వెళ్లారని తెలియజేశారు. భారత దౌత్య అధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని, ఇంత పెద్ద దు:ఖం మరెవరికీ రాకూడదని కెటిఆర్ పేర్కొన్నారు.