పాట్నా: ఈసారి ఎన్నికలలో మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్‌డిఎకు 202 స్థానాలు దక్కాయి. ఇందులో బిజెపికి 89, జెడియుకు 85, ఎల్‌జెపికి 19, హామ్‌కు 5, ఆర్‌ఎల్‌ఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఈ క్రమంలో బిజెపి అత్యధిక స్థానాల పార్టీ అయినా తిరిగి జెడియు నేత నితీశ్‌కు సిఎం పదవి కట్టబెట్టారు. బిహార్ సిఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో రికార్డు స్థాయిలో పదోసారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఎన్డియే రాష్ట్రాల సిఎంలు. ఎపి నుండి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.