చెన్నై: ప్రేమించడంలేదని బాలికను ఓ ప్రేమోన్మాది కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం రమనాథపురం జిల్లా రామేశ్వరం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సెరాంకొట్టెంలో మారియప్పన్ అనే కుటుంబం నివసిస్తోంది. మారియప్పన్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు షాలిని ఇంటర్ కాలేజీలో చదువుతోంది. గత కొన్ని రోజుల నుంచి మునిరాజ్ అనే వ్యక్తి షాలిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాలిక తన తండ్రికి చెప్పడంతో మునిరాజ్‌ను మందలించాడు. మునిరాజు వేధింపులు ఎక్కువగా మారాయి. షాలినిపి ప్రేమించాలంటూ పలుమార్లు వెంటపడ్డాడు. కాలేజీ వెళ్తున్న షాలినిని కత్తీ తీసుకొని పొడిచాడు. ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.