శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, స్పిరిట్ మీడియా బ్యానర్ల మీద సొనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్ దాస్ కె నారంగ్ దివ్యాశీస్సులతో జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమంటే’. ఈ మూవీలో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించారు. ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య మేరుగు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ నవంబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు లవ్ ట్రోట్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ సామ్రాట్ నాగ చైతన్య, సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో నాగ చైతన్య మాట్లాడుతూ .. “నవనీత్ మంచి పాయింట్‌తో కొత్త ప్రేమ కథను అందివ్వబోతోన్నారు. ‘ప్రేమంటే’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ అందమైన కథతో ‘ప్రేమంటే’ రాబోతోంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, ఆనంది, నవనీత్ శ్రీరామ్, జాన్వీ నారంగ్, సుమ కనకాల, హైపర్ ఆది పాల్గొన్నారు.