అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో డైమండ్ పార్కు వద్ద వ్యక్తి హత్య గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు మధ్య ఘర్షణ హత్యకు దారి తీసినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాయితో కొట్టి హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.