మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పం చాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సం ఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భా గంగానే పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్‌ఈసీ షెడ్యూలు విడుదల చేసింది. గురువారం నుంచి నవంబర్ 23 వర కు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని తెలిపింది. ఈ నెల 20న ఓటర్ల దరఖాస్తు లు, తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణ, ఈ నెల 21న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరా ల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా, పో లింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల రెండో వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అదే నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందని తెలిసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల తరువాత పంచాయతీ ఎ న్నికలు నిర్వహించేందుకు మంత్రి మండలి నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. సోమవారం నిర్వహించిన మంత్రిమండలి భేటీలో స్థానిక ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. రిజర్వేషన్ల అమలు, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయ నిపుణుల సలహాలపై పంచాయతీ రాజ్‌శాఖ నివేదిక ఇవ్వడంతో దానిపై మంత్రులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ నెల 24న తెలంగాణ హైకోర్టులో విచారణ గురించి చెప్పారు. మార్చి 31లోపు పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది.