మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవా రం సాయంత్రం ఆయన ప్రజాభవన్ లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కలిసి ఏర్పాటు చేసిన 2047 విజన్ డాక్యుమెం ట్ వార్ రూమ్ సమావేశ మందిరంలో ప్రసంగించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సా ధన సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ కల అన్నారు. ఆ కల సాధనకు ప్రతి ఒక్క రం ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నామని, ఈ లక్ష్య సాధనలో అం దరినీ భాగస్వాములు చేసి సమగ్ర డాక్యుమెంట్ రూపొందించే బాధ్యతను సీఎం రే వంత్ రెడ్డి తనకు అ ప్పగించారని డిప్యూ టీ సీఎం వివరించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రభుత్వం ఐఎస్‌బితో అధికారిక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే వివిధ శాఖ ల నుంచి నోడల్ ఆఫీసర్లను నియమించి వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఐఎస్‌బి బృందం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిందన్నా రు. గ్లోబల్ సమ్మిట్ వచ్చేనెల 8, 9 తేదీల్లో జరగనుందని, తక్కువ సమయం అందుబాటులో ఉ న్నందున పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి విజన్ డా క్యుమెంట్‌ను తుది దశకు తీసుకురావాలని డిప్యూటీ సీఎం
అధికారులకు సూచించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అనేది చరిత్రలో లిఖించదగిన అంశమని డిప్యూటీ సీఎం వివరించారు. ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసు సెక్టార్లలో జిడిపిని పెంచి 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించిందని వివరించారు. రెండు సంవత్సరాల్లో కనబరిచిన నిబద్ధతతోనే 2047 డాక్యుమెంట్ రూపకల్పనకు అడుగులు ముందుకు వేయాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూల అంశాలకు విజన్ డాక్యుమెంట్లో పకడ్బందీగా చోటు కల్పించాలని వివరించారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది వివరించేందుకు దేశంలో అనేక రంగాల్లో ప్రసిద్ధి చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కంపెనీల సీఈఓ లను ఆహ్వానించి గ్లోబల్ సమ్మిట్ ను పెద్ద పండుగలా నిర్వహించనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలోని సంపద, వనరులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చూపడమే కాదని, వాటిని ఏ విధంగా కార్యరూపం దాలుస్తామో కూడా అధికారులు డాక్యుమెంట్ లో చూపించాలని పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు. గురువారం అన్ని శాఖల కార్యదర్శులు మంత్రులతో చర్చించి విజన్ డాక్యుమెంట్ ను తుది దశకు తీసుకురావాలన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులు కూర్చుని కసరత్తు చేసి విజన్ డాక్యుమెంట్ కు ఆమోదం తెలుపుతారన్నారు. 85 వేల కోట్లతో చేపడుతున్న రోడ్ల పనులు పూర్తయితే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని, దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీ పడలేదన్నారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సిఎస్ రామకృష్ణారావు, జయేష్ రంజన్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.