మన తెలంగాణ/హైదరాబాద్: సొంత పార్టీలోని కొందరి తీరు వల్లే జూబ్లీహిల్స్ లో ఓటమి పాలయ్యామని, కొందరు కాంగ్రెస్ కోవర్టులుగా పనిచేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొం దరు కార్యకర్తలు వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై చర్చించేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్‌లో కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, జూబ్లీహిల్స్ నియోజక వర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప లువురు కార్యకర్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక నేతలు, జిల్లాల నుం చి వచ్చిన బీఆర్‌ఎస్ నేతల మధ్య సమన్వయ లో పం కూడా ఓటమికి కారణమని చెప్పినట్టు తెలిసిం ది. స్థానిక జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ నేతలు బైపోల్స్ ను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. నియోజక వర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు కరువయ్యారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పోల్ మేనేజ్‌మెంట్ ను ఎదుర్కోలేకపోవడం కూడా ఓటమికి కారణమని చెప్పుకొచ్చారు. తండ్రి చనిపోయినా కూడా హరీశ్ రావు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పార్టీ కోసం పనిచేశారని ప్రశంసలు కురిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఆ తర్వాత సంస్థాగత నిర్మాణం చేపడతామని అన్నారు. బూత్ ల వారీగా పటిష్టంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దివంగత గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం, ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పడ్డ కష్టానికి మించి తాము పని చేస్తామని, ‘కాలికి బలపం కట్టుకొని తిరుగుతామని కేటీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
నైతిక విజయం బీఆర్‌ఎస్‌దే : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్‌ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాటస్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18వేల ఓట్లు మాత్రమే వచ్చిన జూబ్లీహిల్స్‌లో, ఈ ఉపఎన్నికలో 75వేల ఓట్లు సాధించడం అనేది కార్యకర్తల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతికంగా గెలిచి ఉండవచ్చని, కానీ నైతిక విజయం మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతమ్మదేనని హరీశ్ రావు అన్నారు.