నోబెల్ బహుమతి గ్రహీత దలైలామా మొట్టమొదటిసారి గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు చెందిన దలైలామా ఆల్బమ్ ఆ పోటీలో ఉంది. దలైలామా చేసిన ప్రసంగాలకు సరోద్ వాయిద్య కళాకారుడు అంజద్ అలీఖాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అంతర్జాతీయ కళాకారులు అంద్రాడే, మ్యాగీ రోజర్స్, టోనీ సుకార్, టెడ్ నాష్, దేబీనోవా,రూఫస్ వెయిన్‌రైట్ కూడా పనిచేశారు. ఈ ఆల్బమ్‌ను గ్రామీ అవార్డు విజేత కబీర్ సెహగల్ రూపొందించారు. 2026 ఫిబ్రవరి 1న లాస్ ఏంజెలెస్‌లో 68 వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది