దేవాదాయ శాఖలో మొత్తం 324 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను దేవాదాయ శాఖ జారీ చేసింది. జాయింట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 109 పోస్టులు, డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 21 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 26 పోస్టులు, 6ఏ ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 117 పోస్టులు, 6బి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 32 పోస్టులు, 6సి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 19 పోస్టులను డైరెక్ట్‌గా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాయింట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 223 కాగా, 113 మంది పనిచేస్తున్నారు.
డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 84 కాగా, 63 మంది పనిచేస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 145 కాగా, 119 మంది, 6ఏ ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 532 కాగా, 415 మంది, 6బి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 37 కాగా, 05 మంది, 6సి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 21 కాగా, 02 పనిచేస్తున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. మొత్తం 1042 మంది ఉద్యోగులకు గాను 717 మంది ఉద్యోగులే విధులు నిర్వహిస్తున్నారని మిగతా 324 మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద తీసుకోవాలని నిర్ణయించినట్టు దేవాదాయ శాఖ తెలిపింది.