స్టార్ హీరో కార్తి నటిస్తున్న ‘వా వాతియార్‘ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’ టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమాను డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘అన్నగారు వస్తారు‘ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా హీరో కార్తి నటిస్తున్న ‘అన్నగారు వస్తారు‘ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.