న్యూఢిల్లీ: పలు కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ని ఎన్ఐఎ అధికారులు అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. బిష్ణోయ్‌ని తీసుకువచ్చిన ఓ ప్రత్యేక విమానం కాసేపటి క్రితం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఎన్‌సిపి నేత బాబాసిద్ధిఖ్ హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గతేడాది సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు.