టీం ఇండియా టి-20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. యూట్యూబ్ వ్లాగర్‌గా మారిపోయాడు. ఇటీవలే టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆతిథ్య దేశంతో ఆడి టీ-20 సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుంది. అయితే సూర్య ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లే ప్రయాణాన్ని మొత్తం ఓ వ్లాగ్‌గా చిత్రీకరించి తన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోలో తిలక్ వర్మ, శివమ్ దూబె, జస్ప్రీత్ బుమ్రలు కనిపించారు. ఎయిర్‌పోర్టులో బుమ్రాని.. ‘సర్ జస్ప్రీత్ బుమ్రా’ అంటూ పిలిచాడు. స్కై.. స్కై ట్రైన్‌లో ప్రయాణించబోతున్నాడంటూ సరదాగా అన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో చేసిన కొన్ని ప్రాక్టీస్ క్లిప్‌ను.. చివరిగా తిలక్ వర్మ బర్త్‌డేకు సంబంధించిన కేక్ కట్టింగ్ దృశ్యాలను జత చేశాడు.