అమరావతి: మారేడుమిల్లి పరిధిలో బిఎం వలసలో కాల్పులు కలకలం రేపింది. ఎవొబిలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మంగళవారం ఆరుగురు మావోయిస్టులు తప్పించుకున్నారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, స్పెషల్ జోనల్ సభ్యులు, మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్ జీ, జ్యోగరావు, అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్టు సమాచారం. ఇంటెలిజెన్స్ ఎడిజి లడ్డా ఎన్ కౌంటర్ ధ్రువీకరించారు. మారేడుమిల్లి ఘటనాస్థలికి 5కి.మి. దూరంలో ఎన్ కౌంటర్ జరిగిందని ఇంటెలిజెన్స్ ఎడిజి లడ్డా ఎన్ కౌంటర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. బుధవారం కూడా ఏజెన్సీలో కాల్పులు జరిగాయని అన్నారు. ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఎన్ కౌంటర్ లో 6 నుంచి 7 మంది చనిపోయారని, హిడ్మా లేఖ గురించి తమకు తెలియదని చెప్పారు. ఛత్తీస్ గఢ్ నుంచి ఎపికి రావాలని మావోయిస్టుల యత్నమని, వాళ్లు ఇచ్చిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని.. మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలియజేశారు.
నవంబరు 17న కీలక ఆపరేషన్ చేపట్టామని, మంగళవారం మారేడుమిల్లి హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారని అన్నారు. ఎన్టిఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, ఎక్కడా ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి అయ్యిందని మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమం అని.. పోలీసులు ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారని కొనియాడారు. ఇంటెలిజెన్స్ విభాగం ఈ అంశం మెరుగ్గా పని చేసిందని, తమకు ముందే సమాచారం అందడంతో వారిపై నిఘా పెట్టామని అన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలను గమనించామని, ఒకేసారి అంచనా వేసి ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ లో ఇటీవల కొంతమంది లొంగిపోయారని, కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఎపిలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారని, మావోయిస్టుల కదలికలపై సమాచారం లేదని అన్నారు. హిడ్మా పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదని మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు.