సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 15వ తేదీన గ్లోబ్‌ట్రాటర్ పేరిట భారీ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టైటిల్‌ని పరిచయం చేశారు. ఈ భారీ ప్రాజెక్టుకు ‘వారణాసి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. అంతేకాక.. ఈవెంట్‌లో చిత్రానికి సంబంధించి ఓ గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూసిన ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
అయితే ఈ ఈవెంట్‌లో ప్రతినాయకుడు ‘కుంభ’ పాత్రను పరిచయం చేస్తూ.. ఓ పాటని సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన బృందం ఆలపించారు. ఇప్పుడు అదే పాటని విడుదల చేశారు. ‘‘ప్రళయం.. ప్రళయం’’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రతినాయకుడి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 2027 సమ్మర్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.