హైదరాబాద్: రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది. అతడి తల్లి రమణి(60) తుదిశ్వాస విడిచారు. ఈ నెల 15వ తేదీన ఆమె మరణించారు. తాజాగా రాధాకృష్ణ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ‘‘ఈ ప్రపంచంలో నాకంటూ ఓ స్థానాన్ని కల్పించావు.. నా హృదయంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చావు. నీతో ఉన్న ఇన్నాళ్లు నా జీవితంలో ఓ సెలబ్రేషన్ అమ్మ. నేను ఎప్పటికీ నిన్ను మిస్ అవుతునే ఉంటా.. మై ఫస్ట్ అవ్’’ అంటూ రాధాకృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లి ఫొటోని పోస్ట్ చేశాడు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ సందర్భంగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వద్ద సహాయకుడిగా రాధాకృష్ణ పని చేశాడు. అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, సాహసం, ఒక్కడున్నాడు తదితర చిత్రాలకు అతను పని చేశాడు. గోపిచంద్ హీరోగా నటించిన ‘జిల్’ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రభాస్‌తో హీరోగా ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత కొంతమంది హీరోలతో రాధాకృష్ణ పని చేస్తున్నాడని టాక్ వినిపించింది. కానీ, ఇప్పటివరకూ ఏ ప్రాజెక్టు కూడా పట్టాలెక్కలేదు.