జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా కిల్లర్. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వంజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ ఒక కొత్త తరహా కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ “సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘కిల్లర్‘ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మనాభరెడ్డి.ఎ, సీతారామ్, మనీష్ గిలాడ, విశాల్ రాజ్, చందు పాల్గొన్నారు.