హీరో అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేశారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నా”అని తెలిపారు.
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత నా కంటే భీమ్స్ గురించి ఎక్కువ రాస్తారు. కామాక్షి, అనిల్ పొలిమేర లాంటి సినిమా చేసి త మను తాము నిరూపించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఒక ప్యాషన్‌తో వర్క్ చేస్తున్నారు. ‘12ఎ రైల్వే కాలనీ’ అందరినీ థ్రిల్ చేస్తుంది”అని అన్నారు. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఫ్యామిలీ అంద రూ కలిసి చూసే సినిమా ఇది అని తెలియ జేశారు. డైరెక్టర్ నాని మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఒక మంచి సిని మా చూశామని ఫీల్‌తో బయటికి వెళ్తారు. బీమ్స్ సాంగ్స్ ఇరగదీశారు”అని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విఐ ఆనంద్, విజయ కనకమేడల, శ్రీనివాసా చిట్టూరి, కామాక్షి, బీమ్స్, వైవా హర్ష పాల్గొన్నారు.