వరుస బ్లాక్‌బస్టర్‌ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ… వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో హిస్టారికల్ ఎపిక్ ‘ఎన్‌బికె111’ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రస్తుతం పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా చేస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇక బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నయనతార ఈ ప్రాజెక్ట్‌లో చేరారు. మంగళవారం నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఆమె పాత్ర కథనానికి కీలకం కానుంది. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాలుగవ చిత్రం. డైరెక్టర్ గోపిచంద్ మలినేని నయనతారను గుర్రంపై పరిచయం చేసే విధానం ద్వారా ఈ ప్రాజెక్ట్ ఎంత భారీ స్థాయిలో రూపొందుతోందో స్పష్టమవుతోంది. ఈ చిత్రంతో గోపిచంద్ మలినేని తొలిసారి హిస్టారికల్ డ్రామాలోకి అడుగుపెడుతున్నారు.