2015-16లో నిర్వహించిన
పరీక్షను రద్దు చేసిన హైకోర్టు
టిజిపిఎస్‌సి పరిధి దాటి
వ్యవహరించిందని వ్యాఖ్య
ప్రశ్నపత్రాలను పునర్
మూల్యాంకనం చేయాలి
ఎనిమిది వారాల్లో
ప్రక్రియను పూర్తి చేయాలి
టిజిపిఎస్‌సిని ఆదేశించిన
న్యాయమూర్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకో ర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 201516లో నిర్వహించిన గ్రూ ప్2 పరీక్షను రద్దు చేసింది. ఆ పరీక్షా పేపర్లను పునర్‌మూల్యాంకనం చేయాలని, పునర్మూల్యాంకనం చేసిన తరువాత అర్హులను ప్రకటించాలని టిజిపిఎస్‌సినిఆదేశించింది. ఎనిమిది వారాల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చే యాలని టిజిపిఎస్‌సికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. టిజిపిఎస్‌సి పరిధి దాటి వ్యవహరించిందని,హైకోర్టు ఆదేశాల ను ఉల్లంఘించిందని న్యాయమూర్తి భీమపా క నగేష్ వ్యాఖ్యానించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక మంగళవా రం గ్రూప్-2 పరీక్షలపై సంచలన తీర్పు వెలువరించారు. 201516 గ్రూప్2 రాత పరీక్షలో అసమతుల్యతలు ఉన్నాయని టిజిపిఎస్‌సి అనుసరించిన ప్రక్రియను సవాలు చే స్తూ అనేక మంది ఆశావహులు దాఖలు చేసి న రిట్ పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం మం గళవారం ఈ తీర్పు వెలువరించింది.
పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్, మార్చి 9, 2017 నాటి సాంకేతిక కమిటీ నివేదిక, డివిజన్ బెంచ్ తీర్పును టిజిపిఎస్‌సి ప్రత్యక్షంగా ధిక్కరించిందని వాదించారు. సమాధాన పత్రాలు పార్ట్-బిలో ట్యాంపరింగ్, వైట్‌నర్‌ల వాడకం, మార్పులు కలిగిన ఓఎంఆర్ షీట్‌ల మూ ల్యాంకనం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్ట్ -ఎలో చిన్న చిన్న క్లరికల్ తప్పులను మా త్రమే పరిగణించవచ్చని ఆయన వాదించా రు, కానీ కమిషన్ పార్ట్ -బిలో స్పష్టంగా మా ర్చబడిన సమాధాన పత్రాలను మూల్యాంకనంచేసిందని కోర్టుకు వివరించారు. పేపర్- 1లో సమస్య తలెత్తినప్పుడు, నాలుగు పేపర్ల ను తిరిగి మూల్యాంకనం చేయాలనే టిజిపిఎస్‌సి నిర్ణయాన్ని రవిచందర్ ప్రశ్నించారు.
దీనిని అధికార పరిధిని అధిగమించడంగా ఆయన పేర్కొన్నారు. పునః మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. టిజిపిఎస్‌సి తరపున పి ఎస్ రాజశేఖర్ వాదనలు వినిపించారు. డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సుల ప్రకారం కమిషన్ ఖచ్చితంగా వ్యవహరించిందని వాదించారు. ఆటోమేటెడ్ స్కానర్లు ఏకరూపతను నిర్ధారిస్తాయని, పిటిషనర్లు పేర్కొన్న అక్రమాలకు నిర్దిష్ట రుజువును సమర్పించలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఇప్పుడు నియామకాన్ని రద్దు చేయడం ఇప్పటికే నియమించబడిన అభ్యర్థులను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వాదనను తోసిపుచ్చిన కోర్టు, డివిజన్ బెంచ్ తీర్పు స్పష్టమయిన అవకాశం ఇవ్వలేదని, పార్ట్ -బి లో ట్యాంపరింగ్‌తో కూడిన ఓఎంఆర్ షీట్‌లను పూర్తిగా మినహాయించాలని పేర్కొంది. తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వ ఉద్యోగాలలో న్యాయబద్ధత, పారదర్శకతపై రాజీ పడలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తిచేసి తుది అర్హుల జాబితాను ప్రకటించాలని టిజిపిఎస్‌సిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.