సుప్రీంకోర్టు ఆదేశంతో ఉత్కంఠ
ఆందోళనలో ఎంఎల్‌ఎలు
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎ దుర్కొంటున్న ఎంఎల్‌ఏల విచారణను రెండు నెలల్లో ముగించి, నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తాజాగా స్పీకర్ గడ్డం ప్ర సాద్ కుమార్‌ను ఆదేశించడం తో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 19, 20 తే దీల్లో మరోసారి విచారణకు హా జరు కావాల్సిందిగా స్పీకర్ గ డ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయిం పు ఎంఎల్‌ఏలకు నోటీసులు పంపించారు. నేడు తెల్లం వెంకట్రావు, డా.సంజయ్ కుమార్, రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీని విచారణకు హాజరుకావాల్సిందిగా స్పీకర్ ఆ దేశించారు.ఇదిలాఉండగా విచారణ వేగవంతం చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ భావిస్తున్నారు. దీంతో ఎంఎల్‌ఏలలో ఆందోళన కనిపిస్తున్నది.