హిడ్మా ఎన్‌కౌంటర్ తరువాత హోంశాఖకు ‘టాస్క్ కంప్లీటెడ్’ మెసేజ్
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: దేశంలోని అత్యంత ప్రమాదకర హవోయిస్టు నేతల్లో ఒకరిగా పరిగణించే హిడ్మా లొంగు బాటు కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించంది. అతని ఇంటికి ఏకంగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి వెళ్లారు. ‘బిడ్డా ఇప్పటికైనా ఇంటికి తిరిగిరా.. లేదంటే నీ కోసం నేనే అడవిబాట పడతా’ అంటూ హిడ్మా తల్లి కన్నీళ్లతో వేడుకుంటున్న ఓ వీడియోను పోలీసులు విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివిగల గత ఈ వీడియోలో హిడ్మా తల్లి గోండు భాషలో మాట్లాడిన వీడియో విడుదల అయిన కొద్దిరోజులకే ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకంది. గతంలో చాలా ఎన్‌కౌంటర్ల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఎన్నోసార్లు పోలీసులు ముట్టడించినా తప్పించుకుని అడవుల్లో మాయమవడం అతని ప్రత్యేకత. కర్రెగుట్టల్లో పదివేల మంది బలగాలు ముట్టడించినప్పటికీ అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. గతంలో చాలాసార్లు హిడ్మా చనిపోయాడని వార్తలు వచ్చాయి.
అయితే… హిడ్మా బతికే ఉన్నాడని ఆ తర్వాత పోలీసులు ధ్రవీకరించారు. ఇటీవల మావోయిస్టు ముఖ్యనేతలంతా పోలీసులకు లొంగిపోతుండగా హిడ్మా కూడా ఆయుధాలు అ ప్పగించి పోలీసులకు లొంగిపోతారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ ఎకౌంటర్ జరగడం గమనార్హం. సాక్షాతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హిడ్మాపై ప్రత్యేక దృష్టి పె ట్టిన దాఖలాలు ఉన్నాయి. మం గళవారం ఉదయం ఎన్‌కౌంటర్ పూ ర్తయిన తరువాత ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయానికి ‘టాస్క్ కంప్ల్లీటెడ్’ అనే మెసేజ్ వెళ్లిం ది. పోలీసుల అదుపులో ఉన్నట్లుగా భావిస్తున్న అజాద్ ఇచ్చిన సమాచారంతోనే మావోయిస్టుల సమాచారం పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. ఒకపక్క మావోయిస్టుల్లో సాయు ధ పోరా టం కొనసాగించే విషయంలో భిన్నాభిప్రాయలు వ్యక్తం కావ డం, పార్టీ అగ్రనాయకులు వరుస లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టుల పోరాట అంపశయ్యపైకి చేరుకుందన్న నేపథ్యం లో హిడ్మా ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఇన్నాళ్లూ హి డ్మా భరోసాతోనే అడవుల్లో కొనసాగుతున్న నేతలకు తమ అ గ్రనేత ఎన్‌కౌంటర్‌తో ఇప్పుడు అభద్రతా వాతావరణం ఏర్పడిం ది. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఆ పార్టీ క్యాడర్‌కు నైతికంగా ఎదు రు దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు.