కలకలం సృష్టించిన నక్సల్స్ కదలికలు
హిడ్మా ఎన్‌కౌంటర్ సంఘటనాస్థలంలో
లభించిన డైరీ ఆధారంగా పోలీసుల మెరుపుదాడులు
మీడియాకు వివరాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర
మన తెలంగాణ/హైదరాబాద్ : విజయవాడ, కాకినాడ, ఏలూరులో పోలీసులు జరిపిన మెరుపుదాడుల్లో 31 మందికి పైగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఒకేరోజు మూడు పట్టణాల్లో ఇంత భారీ ఎత్తున మావోయిస్టులు పట్టుబడటం ఎపిలో కలకలం సృష్టించింది. మావో యిస్టుల ఉనికే లేని ఈ జిల్లాల్లో నిషేధిత పార్టీకి చెందిన నక్సల్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. కేంద్ర బలగాలు, ఆక్టోపస్, బాంబ్ స్కాడ్, స్థానిక పోలీసులు ఆయా ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసి 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ ఎడిజి మహేష్ చంద్ర లడ్డా మీడియాకు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి విజయవాడ, కాకినాడ, ఏలూరులలో 31 మంది మావో యిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. ఈ ఆపరేషన్‌లో 12 మంది మహిళలు, నలుగురు కీలక స్థాయి నేతలతో పాటు 11 మంది మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు.
విచారణలో మావోయిస్టులు నగర శివార్లలో నాలుగు చోట్ల ఆయుధాలు, పేలుడు పదార్థాలతో కూడిన డంప్‌లను ఏర్పాటు చేసినట్లు కీలక సమాచారం లభించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. డంప్‌లను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. పెనమలూరు నియోజకవర్గంలోని కొత్త ఆటోనగర్‌లో పది రోజుల కిందట ఛత్తీస్‌గడ్‌కు చెందిన 27 మంది మావో యిస్టులు కార్మికుల పేరిట వచ్చి అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అరెస్టైన వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వారని గుర్తించినట్లు చెప్పారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అలాగే విజయవాడ, కాకినాడ, విజయనగరం, విశాఖ నగరాల్లో 60 మంది హిడ్మా టీమ్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించిందన్నారు. అక్టోబర్ 26న ఏఓబీలోకి హిడ్మా టీమ్ ఎంట రైందని తెలిపారు. ఎవరినైనా టార్గెట్ చేసి మావోయిస్టులు రెక్కీ చేశారా? విజయవాడలోని ఆటోనగర్ ని షెల్టర్ గా ఎందుకు ఎంచు కున్నారు? విఐపి రూట్ ను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారా? అన్న కోణాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయని మహేష్ చంద్ర తెలిపారు. ఈ ఘటనతో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్ట్ అయిన వారిని మరింత లోతుగా విచారించి, వారి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఏలూరులో 15 మంది మావోయిస్టుల అదుపు?
అదే విధంగా ఏలూరులో 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆధ్వర్యంలో ఏలూరు శివారులోని గ్రీన్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ భవనంలో 15 మంది మావో యిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమా చారం.అదుపులోకి తీసుకున్న వారిని ఏలూరు రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలిం చారు. ఒడిశాకు చెందిన వీరంతా గత వారం రోజులుగా గ్రీన్ సిటీలో తలదాచుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కదలికలు పీక్‌లో ఉన్న ప్పుడు కూడా ఇలా జరగలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బలగాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటు న్నారు. ఎపితో పాటు చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా లో కూడా ఫోర్ -స్టేట్ సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ‘మిగిలిన మావోయిస్టులు వలస కూలీల రూంలో దాక్కుని ఉండవచ్చని అనుమా నిస్తున్నారు.