మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్ కౌంటర్ లో ఆరుగురు చనిపోయారని ఇంటిలిజెన్స్ ఎఐడి మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని, మంగళవారం ఉ.6.30 నుంచి 7 గంటల మధ్యలో ఎన్ కౌంటర్ జరిగిందని తెలియజేశారు. ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశామని మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు.