అమరావతి: వైఎస్ ఆర్ సిపి నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై కక్షగట్టి ఎపి పోలీసులు అరెస్టు చేశారని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు అక్రమమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకటరెడ్డి అరెస్టుకు కారణాలు చెప్పాలని, సమాధానం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే స్పందించట్లేదని అంబటి మండిపడ్డారు. పరకామణి కేసులో విచారణకు వెళ్తూ సిఐ చనిపోయారని, హత్యా.. ఆత్మహత్యా అనేది ఎవరికీ తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారికే భద్రత లేదని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చెప్పిందే సిట్ అధికారులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు ఎన్ని సార్లు హెచ్చరించినా.. కొంతమంది పోలీసుల్లో మార్పు రాలేదని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.