న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కోర్టులు, విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు దుండగులు ఇ-మొయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. తీస్ హజారీ, సాకేత్ కోర్టులు లక్ష్యంగా ఢిల్లీ పోలీసులకు బెదింరింపు మొయిల్స్ వచ్చాయి. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే పేరుతో వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ద్వారక, సాకేత్, పటియాలా హౌస్, రోహిణి కోర్టులను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. ద్వారక, ప్రశాంత్ విహార్‌లోని రెండు సిఆర్పిఎఫ్ పాఠశాలలకు కూడా బెదిరింపులు వచ్చాయి.