నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం కలర్ ఫోటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 25న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ టీజర్ లాంచ్ కోసం నిర్వహించిన ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ “మన సమాజంలోని కుల వ్యవస్థ మీద సెటైరికల్‌గా అద్భుతమైన కథను రాసుకున్నారు.
బిందు మాధవి, నవదీప్, నందు బాగా నటించారు”అని అన్నారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ .. “దండోరా’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా ఇంతకు మించి అనేలా ఉంటుంది”అని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ.. “దండోరా’ టీజర్‌ను చూసి అల్లు అర్జున్ అభినందించారు. అదే మాకు పెద్ద సక్సెస్. ఇది చాలా మంచి చిత్రం. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఇలాంటి సందేశాన్ని ఇంత ఎంటర్‌టైనింగ్‌గా చెప్పారా? అని మూవీని చూసిన తరువాత ఆడియెన్స్ అంతా సర్‌ప్రైజ్ అవుతారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవదీప్, నందు, బిందు మాధవి, మురళీకాంత్, రవికృష్ణ, మౌనిక, మణిక, సృజన అడుసుమిల్లి పాల్గొన్నారు.