న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత 50 శాతం కోటా దాటరాదు. ఈ రేఖను పాటించి తీరాలని సుప్రీంకో ర్టు సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే నెలలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నిక లు జరుగుతాయి. తాము విధించిన ఈ 50 శాతం లక్ష్మణ రేఖను దాటితే ఉల్లంఘిస్తే ఎన్నికలను నిలిపివేస్తామని ఘాటుగా హెచ్చరించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, జాయ్‌మాలా బగ్చీతో కూ డిన ధర్మాసనం వెలువరించిన రూలింగ్ కోటా పెం పుదల నిర్ణయాలకు దిగనున్న పలు ఇతర రాష్ట్రాల కు షాక్‌గా మారింది. 2022 జెకె బంతియా కమిష న్ నివేదిక ముందటి పద్ధతిని పాటించాలి. అప్పటి రిజర్వేషన్ల ప్రాతిపదికననే ఎన్నికలు జరపాలి. కమిషన్ రిపోర్టులో ఇతర ఒబిసిలకు 27 శాతం కోటా అమలుకు సిఫార్సు చేశారు. 50 శాతం పరిమితి దాటరాదని పేర్కొన్న ధర్మాసనం ఈ దశలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జ నరల్ తుషార్ మెహత అభ్యర్థన మేరకు తదుపరి వి చారణను బుధవారానికి వాయిదా వేశారు. అయి తే రాష్ట్ర ప్రభుత్వం తాము విధిస్తున్న కోటాను దాటరాదని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎన్నికలపై ప్రభావం పడరాదనే వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదేమీ కుదరదు. కో టా పరిమితి దాటితే తాము ఎన్నికలపై స్టే విధిస్తామని తెలిపారు. ఈ విషయంలో కోర్టు అధికారాల ను పరీక్షించరాదని చురకలు పెట్టారు.
రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటరాదని రాజ్యాంగ ధర్మాసనం తెలిపి ఉంది. దీనిపై తమ ద్విసభ్య ధర్మాసనం ఏమీ చేయలేదు. పైగా బంతియా కమిషన్ రిపోర్టు కోర్టు విచారణ పరిధిలోనే ఉంది. అంతకు ముందటి పరిస్థితులకు అనుగుణంగానే కోటా అమలు , ఎన్నికలు జరగాల్సిందే అని ధర్మాసనం తెలిపింది. కొన్ని సందర్భాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా 70 శాతం వరకూ చేరిందనే వాదనపై సుప్రీంకోర్టు సంబంధిత పక్షాలకు నోటీసులు వెలువరించింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ మెహతా తమ వివరణ ఇచ్చారు. నామినేషన్ల ఘట్టం తుది దశ సోమవారంతో అయిపోయింది. పైగా ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు మే ఆరవ తేదీన వెలువరించిన రూలింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై జస్టిస్ బగ్చీ స్పందించారు. అన్ని విషయాలు తమకు తెలుసునని , కమిషన్ ముందటి పరిస్థితి ఉండాలని తాము తెలియచేశామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని చెప్పడం జరిగితే దీని అర్థం కొన్ని వర్గాలకు 27 శాతం కోటా వర్తింపచేసుకోవచ్చునని చెప్పడమా? అని ప్రశ్నించారు. పరిమితి దాటవచ్చునని చెప్పడం జరిగితే , ఇక తమ ఇంతకు ముందటి పరిమితి దాటరాదనే రూలింగ్ మాట ఎటుపోతుందని ధర్మాసనం ప్రశ్నించింది. వేరే రూలింగ్ అమలుకు ఇంతకు ముందటిది చెల్లకుండా పోతుందా? ఒకదానికి పోటీగా మరోటి వెలురించినట్లుగా భావిస్తారా? అని ద్విసభ్య ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌ను మందలించింది.