రానున్న ఐపిఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ప్రధాన కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర ఎంపికయ్యాడు. ఇప్పటికే సంగక్కర రాజస్థాన్ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా ఉన్నాడు. తాజాగా జట్టు యాజమాన్యం టీమ్ ప్రధాన కోచ్‌గా కూడా నియమించింది. సంగక్కర వచ్చే సీజన్‌లో ఈ రెండు బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. విక్రమ్ రాథోడ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది.