రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఎసిబి దాడులలో అవినీతి అధికారులు పట్టుబడి జైలుకు వెళ్తున్న ధన అశ తీరుతో ప్రభుత్వ అధికారులు మారడం లేదు. ఇదే క్రమంలో లంచం తీసుకుంటూ ఇల్లందు సివిల్ సప్లై డిప్యూటి తహసిల్ధార్, టెక్నికల్ అసిస్టెంట్, రేషన్ డీలర్ సోమవారం పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎసిబి డిఎస్‌పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 7వ తేదిన మండలంలోని ఓ రేషన్‌షాప్‌కు తనిఖికి వెళ్ళిన సివిల్ డిటి మహమ్మద్ యాకుబ్ పాషా షాప్ లో నిలువలు తక్కువగా వున్నాయని అట్టి షాప్ ను సీజ్ చేస్తా అన్నాడు. మరల రేషన్ షాప్‌ను నడిపేందుకు పర్మిషన్ ఇచ్చేందుకు రేషన్‌షాప్ డీలర్‌ను అసిస్టెంట్ విజయ్, రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు
పోతు శబరిష్‌తో 30వేల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంత డబ్బు ఇవ్వలేక రేషన్ డీలర్ ఎసిబి అధికారులను సంప్రదించాడు.దీంతో రేషన్ డీలర్ ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు పట్టణంలోని జగదాంబ సెంటర్‌లో గల ఓ సెల్‌ఫోన్ షాపులో రేషన్ డీలర్ మధ్యవర్తి శబరీష్‌కు డబ్బులు అందజేస్తుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోని తహసిల్ధార్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. అట్టి విచారణలో సివిల్ సప్లై డిటి యాకుబ్‌పాషా, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఆదేశాల మేరకు డీలర్ నుండి డబ్బులు తీసుకున్నట్లు శబరీష్ ఒప్పుకోవడంతో ముగ్గురిపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
గతంలో సైతం పట్టుబడ్డ యాకుబ్‌పాషా ఎసిబికి పట్టుబడ్డ ఇల్లందు సివిల్ సప్లై డిటి మహమ్మద్ యాకుబ్‌పాషాపై అనేక ఆరోపణలు వున్నాయి, గతంలో కొణిజర్లలో 30వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అవినీతికి అలవాటు పడ్డ అధికారి మారకపోగా మరల ఇల్లందు రేషన్‌డీలర్‌లను ఇబ్బందులకు గురిచేస్తు దొరికిపోయాడని ఎసిబి డిఎస్‌పి రమేష్ తెలిపారు. ప్రజల పనులకు ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే తమకు ఫోన్ నెంబర్ 1064 ద్వారా సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా వుంచుతామన్నారు.