బీహార్ అసెంబ్లీ విపక్ష నాయకుడుగా ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్ సోమవారం ఎన్నికయ్యారు. అసెంబ్లీలో విపక్ష నాయకునిగా గుర్తింపు పొందడానికి అసెంబ్లీ మొత్తం బలంలో కనీసం 10 శాతం సీట్లను సాధించాలి. ఈమేరకు మొత్తం 243 స్థానాల్లో ఆర్‌జేడికి 25 స్థానాలు లభించాయి. తేజస్వి తన సమీప ప్రత్యర్థి బీజేపికి చెందిన సతీష్ కుమార్‌పై 14,552 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన కుటుంబానికి కంచుకోటగా ఉంటున్న రాహోపూర్ నుంచి ఎన్నికయ్యారు.