ప్రీ వెడ్డింగ్ షో’తో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. ఈ చిత్రానికి మహేందర్ కుడుదుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్య మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ క్లాప్ కొట్టారు. దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ కు తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు స్వరూప్ మేకర్స్‌కు స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో సరదా, సందడితో కూడిన ఓ అద్భుతమైన ప్రేమకథగా ఉండబోతోంది.