అరుళ్ నిథి, -మమత మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో మై డియర్ సిస్టర్ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ ప్రొమోతో ప్రకటించారు. ఈ అన్‌స్క్రిప్టెడ్ టగ్ -ఆఫ్ -వార్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నాచెల్లెళ్ళ బంధం ఎన్నాళ్లుగానో ముఖ్యమైన భావోద్వేగ అంశం. ఈ భావోద్వేగాన్నిమరోసారి ముందుకు తీసుకువెళ్తూ, ప్యాషన్ స్టూడియోస్ ‘మై డియర్ సిస్టర్’ పేరుతో ఓ మనసుని తాకే భావోద్వేగపూరితమైన కథను అందిస్తోంది. ఈ చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, గోల్డ్‌న్స్ టెలి ఫిలిమ్స్ మణీష్ షా కలిసి నిర్మిస్తున్నారు. ప్రభు జయరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. అరుళ్ నిథి, మమత మోహన్‌దాస్ అన్నాచెల్లెళ్ళుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి న పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. శనివారం విడుదలైన ఫస్ట్ లుక్‌లో అన్నాచెల్లెల్లిద్దరికీ సమాన ప్రాధాన్యం ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.