మక్కా: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముఫరహత్ ప్రాంతంలో బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 42 మంది భారతీయులు సజీవదహనమయ్యారు. మృతులలో హైదరాబాద్‌కు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. భారతీయులు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల ఘటనలు పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం కర్నూల్ బస్సు ప్రమాదం ఘటనలో 19 మంది సజీవదహనం కాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే