లక్నో: ప్రియురాలిని చంపిని కేసులో ఎస్‌ఐని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమీర్‌పూర్ జిల్లా మౌదాహ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కిరణ్ అనే యువతి సిఆర్‌పిఎఫ్ జవాను పెళ్లి చేసుకుంది. అత్తింటి వారిలో గొడవలు జరగడంతో వారిపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. భర్త సోదరుడు తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఎస్‌ఐ అంకిత్ యాదవ్ అప్పగించారు. కేసులో కిరణ్‌కు అంకిత్ యాదవ్ సహాయం చేయడంతో ఇద్దరు మధ్య ప్రేమ పెరిగింది. ఇద్దరు గత కొన్ని రోజుల రిలేషన్‌లో ఉన్నారు. కోరులో విచారణ అనంతరం ఎస్‌ఐతో కిరణ్ కారులో వస్తుండగా ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కారు ఆపి ఆమె తలపై ఎస్‌ఐ అంకిత్ మోదాడు. ఆమె చనిపోయిందనే నిర్థారించుకున్న తరువాత మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఎస్‌ఐని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.